గద్వాల, వెలుగు: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈ నెల 23న గద్వాల, వనపర్తి జిల్లాల్లో పర్యటించనున్నట్లు కలెక్టర్లు సంతోష్, ఆదర్శ్ సురభి తెలిపారు. మంగళవారం ఉదయం 11:30 గంటలకు అలంపూర్ జోగులాంబ దేవి ఆలయానికి చేరుకొని, స్వామి, అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. మధ్యాహ్నం ఒంటి గంటకు కలెక్టరేట్ కు చేరుకొని జిల్లా అధికారులతో జరిగే మీటింగ్ లో పాల్గొంటారు.
జోగులాంబ గద్వాల జిల్లా నుంచి రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవార్డులు పొందిన ప్రముఖ రచయితలు, కళాకారులు, మేధావులతో జరిగే చర్చా వేదికలో పాల్గొంటారని కలెక్టర్ తెలిపారు. అదే రోజు మధ్యాహ్నం 3:30 గంటలకు వనపర్తికి చేరుకొని కలెక్టరేట్లో జిల్లాలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. గవర్నర్ పర్యటన సందర్భంగా అధికారులతో సమావేశం నిర్వహించి ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు.
