షిప్‌‌లో 48 మందికి కరోనా

షిప్‌‌లో 48 మందికి కరోనా

ఫ్లోరిడా: ప్రపంచంలోనే అతిపెద్ద క్రూయిజ్‌‌ నౌక ‘రాయల్‌‌ కరేబియన్‌‌ సింఫనీ ఆఫ్‌‌ సీస్‌‌’లో 48 మందికి కరోనా సోకింది. దీంతో షిప్‌‌ను శనివారం ఫ్లోరిడాలోని మయామి పోర్ట్‌‌లో ఆపేశారు. ఈ షిప్‌‌లో స్టాఫ్‌‌, ప్యాసింజర్లతో కలిపి మొత్తం 6,091 మంది ఉన్నారు. ప్రతి ఒక్కరినీ క్వారంటైన్‌‌కు తరలించినట్లు షిప్​ ప్రతినిధులు చెప్పారు. పాజిటివ్​ వచ్చిన వాళ్లలో కొంతమందిలో లక్షణాలు కనిపించట్లేదని, ఇంకొంతమందిలో మైల్డ్​ లక్షణాలు ఉన్నాయని తెలిపారు. ఒక ప్యాసింజర్‌‌‌‌ కు జబ్బు చేస్తే కరోనా టెస్ట్‌‌ చేశామని, రిజల్ట్​ పాజిటివ్​ వచ్చిందని వివరించారు. వెంటనే ఆమెను ఐసోలేట్‌‌ చేసి, ట్రీట్‌‌మెంట్‌‌ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. షిప్‌‌లో ఉన్నోళ్లు అందరికీ టెస్టులు చేయగా, 48 మందికి పాజిటివ్‌‌ వచ్చినట్లు వెల్లడించారు.