
నిరుద్యోగులకు గుడ్ న్యూస్. కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ ఆధ్యర్యంలోని నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (NIC) 495 పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే..దరఖాస్తు ప్రక్రియ బుధవారం ప్రారంభమైందని.. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సధ్వినియోగం చేసుకోవాలని తెలిపింది NIC.
దరఖాస్తులకు మార్చి 26 చివరి తేదీ. 495 ఉద్యోగాల్లో 288 సైంటిస్టులు, 207 సైంటిఫిక్/టెక్నికల్ పోస్టులు ఉన్నాయి. ఇంజనీరింగ్ పాసైనవారు ఈ ఉద్యోగాలకు అర్హులు. పూర్తి వివరాలకు WWW.calicut.nielit.in వెబ్ సైట్ చూడవచ్చు.