
ఏపీలో కరోనా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 4,955 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒకరు మరణించారు. దీంతో ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 21,01,710 కు చేరింది. మొత్తం 14509 మంది చనిపోయారు. ఇంకా 22,870 ఆక్టివ్ కేసులున్నాయి. నిన్న నమోదైన కేసుల్లో అత్యధికంగా విశాఖపట్నంలో1103 చిత్తూరులో 1039 కేసులు నమోదయ్యాయి.