18 నెలల తర్వాత కాశ్మీర్​లో 4జీ

18 నెలల తర్వాత కాశ్మీర్​లో 4జీ

జమ్మూ: జమ్మూకాశ్మీర్ లో హైస్పీడ్ 4 జీ మొబైల్ ఇంటర్నెట్ సేవలు మళ్లీ మొదలు పెట్టినట్లు అక్కడి ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సర్వీసులు స్టార్ట్ అవుతాయని కాశ్మీర్ అధికార ప్రతినిధి శుక్రవారం సాయంత్రం ట్వీట్ చేశారు. 2019 ఆగస్టు 5న జమ్మూకాశ్మీర్ రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ రద్దు చేసినప్పటి నుంచి ఇంటర్నెట్ సర్వీసులను ప్రభుత్వం నిలిపివేసింది. ఈ నిర్ణయంపై సమీక్షించి, ఇంటర్నెట్ సర్వీసులను రీస్టోర్ చేయాలని 2020 జనవరిలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు మేరకు కేంద్ర ప్రభుత్వం జమ్మూలోని గండర్ బల్, కాశ్మీర్​లోని ఉధంపూర్ జిల్లాల్లో 4జీ ఇంటర్నెట్ సర్వీస్​ను స్టార్ట్ చేసింది. మిగిలిన జిల్లాల్లో ఇంటర్నెట్ స్పీడ్ 2జీకి పరిమితం చేసింది. ప్రస్తుతం 18 నెలల తర్వాత జమ్మూకాశ్మీర్ అంతటా 4 జీ సర్వీస్ స్టార్ట్ చేస్తున్నట్లు ప్రకటించింది.

For More News..

టెన్త్​ పాసైతే​ చాలు​.. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్..

ఐపీఎల్‌ ఆక్షన్‌కు 1097 మంది ప్లేయర్లు