రేసులోనే.. నాలుగో టీ20లో ఇండియా గెలుపు

రేసులోనే.. నాలుగో టీ20లో ఇండియా గెలుపు

రాజ్‌‌‌‌‌‌‌‌కోట్‌‌‌‌: సిరీస్‌‌‌‌లో నిలవాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌‌‌‌లో ఇండియా బౌలర్లు సత్తా చాటారు. బ్యాటింగ్‌‌‌‌లో టాపార్డర్‌‌‌‌ ఫెయిలైనా.. దినేశ్‌‌‌‌ కార్తీక్‌‌‌‌ (27 బాల్స్‌‌‌‌లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 55), హార్దిక్‌‌‌‌ పాండ్యా (31 బాల్స్‌‌‌‌లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 46) సూపర్‌‌‌‌ ఫినిషింగ్‌‌‌‌ ఇవ్వడంతో.. శుక్రవారం జరిగిన నాలుగో టీ20లో టీమిండియా 82 రన్స్‌‌‌‌ తేడాతో సౌతాఫ్రికాపై గెలిచింది. దీంతో ఐదు మ్యాచ్‌‌‌‌ల సిరీస్‌‌‌‌ను 2–2తో సమం చేసింది. టాస్‌‌‌‌ ఓడి బ్యాటింగ్‌‌‌‌కు దిగిన ఇండియా 20 ఓవర్లలో 169/6 స్కోరు చేసింది. తర్వాత ప్రొటీస్​16.5 ఓవర్లలో 87 రన్స్‌‌‌‌కు కుప్పకూలింది. డసెస్‌‌‌‌ (20) టాప్‌‌‌‌ స్కోరర్‌‌‌‌. ఇన్నింగ్స్‌‌‌‌ మొత్తంలో 8 మంది సింగిల్‌‌‌‌ డిజిట్‌‌‌‌కే పరిమితమయ్యారు. ఇంటర్నేషనల్​ టీ20ల్లో తొలి ఫిఫ్టీ సాధించిన కార్తీక్​కు ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు లభించింది. 

దినేశ్​ సూపర్‌‌‌‌ ఫినిషింగ్‌‌‌‌...
స్టార్టింగ్‌‌‌‌లో పిచ్‌‌‌‌ బౌలర్లకు సహకరించడంతో.. ఇండియా టాపార్డర్‌‌‌‌ చేతులెత్తేసింది. సఫారీ పేస్‌‌‌‌–స్పిన్‌‌‌‌ దెబ్బకు ఓపెనర్​ రుతురాజ్‌‌‌‌ (5), శ్రేయస్‌‌‌‌ అయ్యర్‌‌‌‌ (4) నిరాశపర్చారు. ఇషాన్‌‌‌‌ కిషన్‌‌‌‌ (27) శుభారంభాన్ని సద్వినియోగం చేసుకోలేకపోవడంతో ఇండియా 40 రన్స్‌‌‌‌కే మూడు వికెట్లు కోల్పోయింది. కీలక మ్యాచ్​లోనూ కెప్టెన్​ పంత్‌‌‌‌ (17), హార్దిక్‌‌‌‌తో కలిసి నెమ్మదిగా ఆడటంతో సగం ఓవర్లకు ఇండియా  53/3 స్కోరు మాత్రమే వచ్చింది. అయితే 12వ ఓవర్‌‌‌‌లో పాండ్యా రెండు వరుస సిక్సర్లతో గేర్‌‌‌‌ మార్చినా.. తర్వాతి ఓవర్‌‌‌‌లో పంత్​ను మహారాజ్‌‌‌‌ (1/29) ఔట్​ చేశాడు.  ఈ దశలో పాండ్యాతో జతకలిసిన దినేశ్‌‌‌‌ కార్తీక్‌‌‌‌ సూపర్‌‌‌‌ ఇన్నింగ్స్‌‌‌‌ ఆడాడు. ఈ ఇద్దరూ పోటీపడి బౌండ్రీలు బాదారు 16, 17వ ఓవర్లలో ఇద్దరు కలిసి ఆరు ఫోర్లు కొట్టడంతో 28 రన్స్‌‌‌‌ వచ్చాయి. 18వ ఓవర్‌‌‌‌లో కార్తీక్‌‌‌‌ వరుసగా 6, 4, 4తో 16 రన్స్‌‌‌‌ పిండుకున్నాడు. 19వ ఓవర్‌‌‌‌లో భారీ సిక్స్‌‌‌‌ కొట్టి పాండ్యా ఔట్‌‌‌‌కావడంతో ఐదో వికెట్‌‌‌‌కు 65 రన్స్‌‌‌‌కు బ్రేక్‌‌‌‌ పడింది. తర్వాత ఓ ఫోర్‌‌‌‌, సిక్స్‌‌‌‌తో ఫిఫ్టీ పూర్తి చేసిన కార్తీక్‌‌‌‌ లాస్ట్‌‌‌‌ ఓవర్‌‌‌‌లో వెనుదిరిగాడు. ఓవరాల్‌‌‌‌గా ఆఖరి ఐదు ఓవర్లలో 73 రన్స్‌‌‌‌ రావడంతో ఇండియా మంచి టార్గెట్‌‌‌‌ను నిర్దేశించింది. 

అవేశ్​ అదుర్స్‌‌..
నార్మల్​ టార్గెట్‌‌ను కాపాడుకునే క్రమంలో  ఇండియా బౌలర్లు ఆరంభం నుంచే కట్టుదిట్టంగా బంతులు వేశారు. ముఖ్యంగా పేసర్‌‌ అవేశ్‌‌ ఖాన్‌‌(4/18) మంచి లైన్‌‌ అండ్‌‌ లెంగ్త్‌‌తో సఫారీ హిట్టర్లను కట్టడి చేస్తే స్పిన్నర్‌‌ చహల్‌‌ (2/21) అతనికి అండగా నిలిచాడు. దీంతో డికాక్‌‌ (14)తో మొదలైన వికెట్ల పతనం వరుస విరామాల్లో వేగంగా సాగింది. మధ్యలో డసెస్‌‌ కాసేపు పోరాడినా.. రెండో ఎండ్‌‌లో బావూమ (8 రిటైర్డ్‌‌), ప్రిటోరియస్‌‌ (0), క్లాసెస్‌‌ (8), మిల్లర్‌‌ (9) నిరాశపర్చారు. ఫలితంగా 11 ఓవర్లలో సఫారీలు 59 రన్స్‌‌కే 4 వికెట్లు కోల్పోయి ఎదురీత మొదలుపెట్టారు. 14వ  ఓవర్‌‌లో అవేశ్‌‌ ఖాన్‌‌.. ఆరు బాల్స్‌‌ తేడాలో డసెన్‌‌, జెన్‌‌సెన్‌‌ (12), మహారాజ్‌‌(0) వికెట్లు తీయడంతో ప్రొటీస్‌‌ ఓటమి ఖాయమైంది. తర్వాతి ఓవర్‌‌లో చహల్‌‌.. నోర్జ్‌‌ (1)ను ఔట్‌‌ చేయగా..  ఎంగిడి (4) లాస్ట్‌‌ వికెట్‌‌గా వెనుదిరగడంతో ఇండియా ఘన విజయం సాధించింది. 

సంక్షిప్త స్కోర్లు
ఇండియా: 20 ఓవర్లలో 169/6 (కార్తీక్‌‌‌‌ 55, పాండ్యా 46, ఎంగిడి 2/20), సౌతాఫ్రికా: 16.5 ఓవర్లలో 87 ఆలౌట్‌‌ (డసెన్‌‌ 20, 
అవేశ్‌‌ ఖాన్‌‌ 4/18, చహల్‌‌ 2/21).