
హైదరాబాద్: ఈ నెల 15వ తేదీ నుంచి రైతుబంధు సాయాన్ని అన్నదాతల అకౌంట్లో జమ కానున్న విషయం తెలిసిందే. ఈ మేరకు భూ సమస్యలకు ప్రభుత్వం కటాఫ్ తేదీని నిర్ణయించింది. ధరణి పోర్టల్ ద్వారా వచ్చిన భూ సమస్యల ఫిర్యాదులను పరిష్కరించేందుకు 5 రోజుల స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే పార్ట్ -బీ నుంచి పార్ట్ -ఏలో చేరిన భూములకు కటాఫ్ తేదీని జూన్ -10లోగా నిర్ణయించినట్లు మంగళవారం సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. రోజుకు 20శాతం చొప్పున భూ వివాదాలను పరిష్కరించాలని కలెక్టర్లను ఆదేశించారు సీఎస్.