కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. మచారెడ్డి మండలం ఘన్ పూర్ గ్రామ శివారులో ఆర్టీసీ బస్సు కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు స్పాట్ లోనే చనిపోయారు. ఓ చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది.  కామారెడ్డి వైపు నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న కారును ఎదురుగా వస్తున్న ఆర్టీసీ భస్సు ఢీ కొట్టింది. దీంతో కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు మహిళలు, ఇద్దరు మగవారితో పాటు ఓ బాలుడు మృతి చెందగా... ఓ చిన్నారికి తీవ్ర గాయాలు అయ్యాయి. 

ఆర్టీసీ బస్సు ముందు టైర్ పేలడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. మృతులంతా నిజామాబాద్ జిల్లా కమ్మరిపల్లికి చెందిన వారిగా భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు... ఘటన స్థలానికి చేరుకొని గాయపడిన చిన్నారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్య పరస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

మరిన్ని వార్తల కోసం:

యాదాద్రి పునః ప్రారంభం.. కేసీఆర్ ప్రత్యేక పూజలు

చిల్లరతో రెండున్నర లక్షల బైక్ కొన్నడు

భార్యపై జోక్.. చెంప చెళ్లుమనిపించిన హాలీవుడ్ హీరో