
వాషింగ్టన్: ప్రతిష్టాత్మక 94వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ఆరంభమైంది. అమెరికాలోని లాస్ ఏంజెల్స్ లోని డాల్బీ థియేటర్ లో ఈ వేడుకగా అట్టహాసంగా జరుగుతోంది. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న హాలీవుడ్ సూపర్ స్టార్ విల్ స్మిత్.. కమెడియన్ క్రిస్ రాక్ పై చేయి చేసుకోవడం హాట్ టాపిక్ గా మారింది. తన భార్యపై జోక్ వేశాడనే కారణంతో విల్ స్మిత్ అతడి చెంప పగులగొట్టాడు. తొలుత స్టేజీ మీదకు వచ్చిన క్రిస్ రాక్.. తనదైన శైలిలో అందరినీ నవ్వించాడు. అతడు వేసిన జోక్స్‌కు ఓ దశలో విల్ స్మిత్, ఆయన భార్య జేడ్ పింకెట్ స్మిత్ కూడా ఎంజాయ్ చేశారు.
VIA JAPANESE TELEVISION: The uncensored exchange between Will Smith and Chris Rock pic.twitter.com/j0Z184ZyXa
— Timothy Burke (@bubbaprog) March 28, 2022
జేడ్ పింకెట్ స్మిత్‌పై క్రిస్ రాక్ వేసిన ఓ జోక్.. అక్కడి వాతావరణాన్ని పూర్తిగా మార్చివేసింది. అనారోగ్యంతో జేడ్ పింకెట్ గుండు చేయించుకుంది. అయితే ఆమె లుక్ మీద క్రిస్ జోక్ వేశాడు. ఇది విన్న వెంటనే విల్ స్మిత్ వేగంగా అడుగులు వేసుకుంటూ స్టేజీ మీదికి వెళ్లి.. క్రిస్ రాక్ ముఖంపై పంచ్ విసిరాడు. అనంతరం తన సీట్లో కూర్చున్న తర్వాత కూడా గట్టిగా తిట్టాడు. ‘నీ నోటి నుంచి నా భార్య పేరును మరోసారి వినదలచుకోలేదు’ అంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఈ ఘటనతో ఒక్కసారి బిత్తరపోయిన క్రిస్ రాక్.. వెంటనే తేరుకున్నాడు. మళ్లీ అందర్నీ నవ్వించే ప్రయత్నం చేశాడు. ఇకపోతే, టెన్నిస్ దునియాలో సంచలనంగా పేరొందిన విలియమ్స్ సిస్టర్స్ జీవితం మీద తెరకెక్కించిన ‘కింగ్ విలియమ్స్’ అనే సినిమాలో కోచ్ పాత్రలో నటించిన విల్ స్మిత్ కు ఆస్కార్ అవార్డు దక్కింది.
మరిన్ని వార్తల కోసం: