చిల్లరతో రెండున్నర లక్షల బైక్ కొన్నడు

చిల్లరతో రెండున్నర లక్షల బైక్ కొన్నడు

సేలం: యంగ్స్టర్స్కు బైకులపై తిరగాలనే కోరిక ఉంటుంది. సొంత బైక్స్పై రైడ్కు వెళ్లాలనే సరదా ఉండని యువకులు ఉండరంటే అతిశయోక్తి కాదు. తమకు నచ్చిన బైక్ కొనివ్వాలంటూ పేరెంట్స్ ను ఇబ్బంది పెట్టే వారి గురించి వినే ఉంటాం. కానీ కొందరు మాత్రం జాబ్స్ చేస్తూ వచ్చిన డబ్బుల్ని ఆదా చేసుకుని.. తమ కోరికను నెరవేర్చుకుంటారు. తమిళనాడులోని సేలంకు చెందిన వి.బూబతి కూడా అలాంటి కోవకు చెందిన యువకుడే. 

బీసీఏ గ్రాడ్యుయేట్ అయిన బూబతి.. ఓ ప్రైవేటు కంపెనీలో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేస్తున్నాడు. నాలుగేళ్ల నుంచి ఓ యూట్యూబ్ ఛానల్ ను కూడా నడుపుతున్నాడు. అయితే అతడికి బజాజ్ డొమినార్ బైక్ కొనాలనేది డ్రీమ్. కానీ లక్షల రూపాయలు పెట్టి బైక్ కొనేంత స్థోమత లేదు. దీంతో మూడేళ్ల నుంచి ఒక్కో రూపాయిని జమ చేశాడు. తన రోజువారీ సేవింగ్స్ లో చిల్లరను పోగు చేశాడు. వాటిలో అన్నీ రూపాయి కాయిన్సే. ఇలా దాచిన చిల్లరతో బైక్ కొనేందుకు షోరూమ్ కు వెళ్లాడు. షోరూమ్ సిబ్బంది దీన్ని చూసి అవాక్కయప్యారు. కానీ మెళ్లిగా తేరుకుని చిల్లరను లెక్కించారు. అలా రూ.2.6 లక్షలు చెల్లించి.. బూబతి తనకు నచ్చిన డొమినార్ బైక్ కొనుక్కున్నాడు. చిల్లర లెక్కించేందుకు తమ సిబ్బందికి పది గంటలు పట్టిందని షోరూమ్ మేనేజర్ మహావిక్రాంత్ అన్నారు.

మరిన్ని వార్తల కోసం:

భార్యపై జోక్.. చెంప చెళ్లుమనిపించిన హాలీవుడ్ హీరో

దేవుడి దగ్గర రాజకీయాలు చేయడం బాధగా ఉంది