మున్సిపల్ శాఖలో ఒకే రోజు 50 జీవోలు..మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అభివృద్ధి పనులకు ఫండ్స్

మున్సిపల్ శాఖలో ఒకే రోజు 50 జీవోలు..మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అభివృద్ధి పనులకు ఫండ్స్

హైదరాబాద్, వెలుగు: మున్సిపల్ శాఖలో ఒకే రోజు 50 జీవోలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి నిధుల కేటాయింపునకు పరిపాలన అనుమతులు ఇస్తూ మున్సిపల్ శాఖ సెక్రటరీ టీకే శ్రీదేవి శనివారం ఒక్క రోజే 50 జీవోలు విడుదల చేశారు. యూఐడీఎఫ్ (అర్బన్ ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌‌‌‌మెంట్) స్కీమ్ కింద 2024– 25 ఆర్థిక సంవత్సరంలో ఈ నిధులు ఖర్చు చేయనున్నారు. 

ఈ నిధుల్లో ఎన్‌‌‌‌హెచ్‌‌‌‌బీ (నేషనల్ హౌసింగ్ బ్యాంక్) షేర్ అధికంగా ఉండగా, రాష్ట్ర ప్రభుత్వ వాటా నామమాత్రంగా ఉంది. ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో మంజూరు చేసిన పనులు, వాటికయ్యే ఖర్చు, ఇందులో ఎన్‌‌‌‌హెచ్‌‌‌‌బీ వాటా, రాష్ట్ర వాటాను జీవోలలో పేర్కొన్నారు. జహీరాబాద్, వనపర్తి, వికారాబాద్, తాండూరు, సూర్యాపేట, సిరిసిల్ల, సిద్దిపేట, షాద్‌‌‌‌నగర్, సంగారెడ్డి, సదాశివపేట్, పెద్దపల్లి, పాల్వంచ, నల్గొండ, నాగారం, మిర్యాలగూడ, మెట్‌‌‌‌పల్లి, మెదక్, మందమర్రి, మహబూబాబాద్, కోరుట్ల, కోదాడ, కామారెడ్డి, కాగజ్‌‌‌‌నగర్, జనగామ, జల్‌‌‌‌పల్లి, జగిత్యాల, గజ్వేల్, గద్వాల, దుండిగల్, దమ్మాయిగూడ, బోధన్‌‌‌‌, బెల్లంపల్లి, భువనగిరి, ఆర్మూర్, బడంగ్‌‌‌‌పేట, అదిలాబాద్ మున్సిపాలిటీలు నిధులకు పరిపాలన అనుమతులిచ్చిన జాబితాలో ఉన్నాయి. 

అలాగే, రామగుండం, ఫిర్జాదిగూడ, నిజామాబాద్, నిజాంపేట, మీర్‌‌‌‌‌‌‌‌పేట, మహబూబ్‌‌‌‌నగర్, కొత్తగూడెం, ఖమ్మం, కరీంనగర్, జవహార్ నగర్, గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ల జాబితాలో ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా రూ.1,733 కోట్లతో 8 వాటర్ సప్లై ప్రాజెక్టులు, 9 అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ప్రాజెక్టుల నిర్మాణానికి పరిపాలన అనుమతులు ఇస్తూ జీవో 745ను టీకే శ్రీదేవి మరో జీవో జారీ చేశారు. వీటిలో ఎన్‌‌‌‌హెచ్‌‌‌‌బీ వాటా రూ.1,230.93 కోట్లు కాగా, రూ.502.07 కోట్లు రాష్ట్ర వాటా నిధులు ఉన్నాయి.