అమెరికాలో టోర్నడో బీభత్సం సృష్టించింది. గతంలో ఎన్నడూ లేనంత ఉధృతితో ఏర్పడిన టోర్నడోలు కెంటకీ రాష్ట్రంపై విరుచుకుపడ్డాయి. వాటి కారణంగా కెంటకీ స్టేట్ లోనే 50 మంది వరకు చనిపోయారని గవర్నర్ యాండీ బిషర్ ప్రకటించారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందన్నారు. ఎక్కడ చూసినా శిథిలాల కుప్పలు, కూలిన ఇళ్లు, ధ్వంసమైన వాహనాలే కనిపిస్తున్నాయి. 1974 తర్వాత ఇదే అతిపెద్ద విధ్వంసం అని భావిస్తున్నారు. కెంటకీతో పాటు దాని చుట్టుపక్కల రాష్ట్రాల్లోనూ టోర్నడోల ప్రభావం ఉందని అమెరికా మీడియా రిపోర్ట్ చేసింది. మేఫీల్డ్ నగరంలో కొవ్వొత్తుల ఫ్యాక్టరీలో పైకప్పు కూలిపోవడంతో చాలా మంది చనిపోయారని గవర్నర్ చెప్పారు. రాష్ట్రమంతా అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్లు ప్రకటించారు
At least 50 people dead after tornado hits US state of Kentucky, says Governor Andy Beshear pic.twitter.com/1xZpK3Fc8r
— ANI (@ANI) December 11, 2021
