
హైదరాబాద్: తెలంగాణలో మంగళవారం 51 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో 37 జీహెచ్‌ఎంసీ కేసులు కాగా, 14 మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారు. ఈ కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 1,326కి చేరింది. ఈ రోజు 21 మంది ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. వీరితో కలిపి మొత్తంగా 822 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు.
వైరస్ బారిన పడి ఈరోజు ఇద్దరు మరణించారు, దీంతో ఇప్పటివరకు కరోనా బారినపడి 32 మంది మరణించారు. మరోవైపు కరోనా బాధితులు వేగంగా కోలుకుంటుంటున్నారని బులెటిన్ లో పేర్కొన్నారు. ప్రస్తుతం 472 మంది రాష్ట్రంలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా ఈ కరోనా మహమ్మారి నుండి రక్షించుకునేందుకు ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్ళకూడదని అధికారులు సూచిస్తున్నారు.