కాశ్మీర్ విభజన చట్టంలో 52 తప్పులు

కాశ్మీర్ విభజన చట్టంలో 52 తప్పులు
  • తప్పొప్పుల పట్టికను ప్రచురించిన కేంద్రం
  • చట్టంలో ఉన్న డీలిమిటేషన్ వాక్యమూ తొలగింపు  

న్యూఢిల్లీ: జమ్మూ కాశ్మీర్ ను రెండు యూనియన్ టెర్రిటరీలుగా విభజించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్​లో 52 చిన్న చిన్న తప్పులు దొర్లాయి. కొన్ని చోట్ల స్పెల్లింగ్​మిస్టేక్స్, కొన్ని చోట్ల పదాలు, మరికొన్ని చోట్ల సంవత్సరాలు మారిపోయాయి. వీటన్నింటినీ సవరిస్తూ కేంద్రం గురువారం మూడు పేజీల తప్పొప్పుల పట్టిక(కొరియాండం)ను ప్రచురించింది. జమ్మూకాశ్మీర్​లోని పార్లమెంటరీ నియోజకవర్గాలను పునర్విభజించాలని చట్టంలో పేర్కొన్నారు. అయితే, ఆ వాక్యాన్ని ఇప్పుడు వదిలేసి చదువుకోవాలని తప్పొప్పుల పట్టికలో స్పష్టం చేసింది. కాగా, జమ్మూ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ యాక్ట్​లో ‘యూనియన్ టెర్రిటరీ ఆఫ్​ జమ్మూ అండ్​కాశ్మీర్’ అని ఉండాల్సిన చోట ‘స్టేట్​ఆఫ్​ జమ్మూ అండ్​కాశ్మీర్’ ఉంది. ఇనిస్టిట్యూషన్స్ యాక్ట్ 2004 అనేది 2005గా మారింది. 1909 అనేది 1951గా వచ్చింది. అలాగే షెడ్యూల్డ్ క్యాస్ట్స్, టెర్రిటరీస్, షరియత్​వంటి పదాల్లోనూ అక్షర దోషాలు రాగా, వాటన్నింటినీ కేంద్రం సవరించింది.