ఆస్కార్ వేడుకల్లో 30 సెకన్ల యాడ్కు అన్ని కోట్లా..?

ఆస్కార్ వేడుకల్లో 30 సెకన్ల యాడ్కు అన్ని కోట్లా..?

ఆస్కార్ వేడుకలకు సర్వం సిద్ధమైంది. 95వ ఆస్కార్ అవార్డుల వేడుకకు మరికొద్ది గంటల్లో తెరలేవనుంది. అమెరికా లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. భారత కాలమానం ప్రకారం మార్చి 13 తెల్లవారుజామున 5.30 గంటలకు ఆస్కార్ అవార్డుల వేడుక మొదలవనుంది. మొత్తం 23 విభాగాల్లో విజేతలు ఆస్కార్ అవార్డులను అందుకోనున్నారు. 

భారత్ నుంచి మూడు చిత్రాలు..

భారత్ నుంచి ఈ సారి ఆస్కార్ అవార్డుల బరిలో మూడు చిత్రాలు నిలిచాయి. రాజమౌళి ఆర్ఆర్ఆర్ నుంచి నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్  విభాగంలో స్థానం దక్కించుకుంది.   శౌనక్ సేన్ దర్శకత్వం వహించిన  ఆల్ దట్ బ్రీత్స్ చిత్రం డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలిమ్ విభాగంలో నామినేట్ అయింది. కార్తికీ గోన్సాల్వెస్ తెరకెక్కించిన ది ఎలిఫెంట్ విస్పరర్స్’ సినిమా డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిమ్ కేటగిరీలో నామినేషన్ అందుకుంది. 

వేడుకల్లో మార్పులు..

95వ ఆస్కార్ వేడుకల్లో నిర్వాహకులు పలు మార్పులు చేశారు. ఆస్కార్ వేడుకల్లో అతిథులకు గతంలో రెడ్ కార్పెట్ స్వాగతం పలికేది. కానీ ఈ సారి భిన్నంగా రెడ్ కార్పొట్ తో కాకుండా షాంపైన్ కలర్ కార్పెట్ తో ఆస్కార్ వేడుక అతిథులకు స్వాగతం పలకనుంది. 50 వేల  స్క్వేర్ ఫీట్ ఉండే ఈ కార్పెట్ ధర 24 వేల 700 డాలర్స్. ఇది మొత్తం ఇన్ స్టాల్ చేయడానికి 600 గంటలు సమయం పట్టిందట.

ఆస్కార్ వేడుకల ఖర్చు..?

95వ ఆస్కార్ అవార్డుల కోసం  56.6 మిలియన్ డాలర్లను ఖర్చు చేస్తున్నారు. భారత కరెన్సీలో రూ.  463 కోట్ల 92 లక్షల 47 వేల 300 అన్నమాట. ఇందులో  కార్పెట్ వద్ద ఓ నటి వేసుకునే డ్రెస్ ఖరీదే 10 మిలియన్ డాలర్స్ ఉంటుందట. ఆస్కార్‌ ఈవెంట్‌లో ఏదైనా యాడ్‌ ఇవ్వాలి అనుకుంటే 30 సెకన్లకు గాను 2 మిలియన్స్‌ డాలర్స్‌ చెల్లించాల్సి ఉంటుంది. అంటే మన కరెన్సీలో 16 కోట్ల 39 లక్షల,31 వేలు.