
అహ్మదాబాద్: గుజరాత్‌కు చెందిన 56 ఏండ్ల పవర్‌లిఫ్టర్ లలిత్ పటేల్ థాయ్‌లాండ్‌లోని పట్టాయాలో జరిగిన ఐబీబీఎఫ్ వరల్డ్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో మూడు గోల్డ్ మెడల్స్ సాధించి సత్తా చాటాడు. మాస్టర్2 కేటగిరీ (83–-93 కేజీలు)లో పోటీపడ్డ పటేల్ బెంచ్ ప్రెస్, డెడ్‌లిఫ్ట్, స్క్వాట్ ఈవెంట్లలో అగ్రస్థానంలో నిలిచాడు.ఈ టోర్నీ కోసం లలిత్ ఎనిమిది నెలల పాటు తీవ్రమైన శిక్షణ తీసుకున్నాడు. ఐదేండ్ల కిందట 51 ఏండ్ల వయసులో పవర్ లిఫ్టింగ్‌ను ప్రారంభించిన అతను విజయానికి వయసు అడ్డుకాదని నిరూపించాడు.