ప్రజావాణికి 575 ఫిర్యాదులు

ప్రజావాణికి 575 ఫిర్యాదులు
  •  ఇందులో రెవెన్యూ సంబంధిత కంప్లయింట్లే ఎక్కువ

పంజాగుట్ట, వెలుగు: బేంగంపేటలోని మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజా భవ న్‌‌‌‌‌‌‌‌లో శుక్రవారం నిర్వహించిన ప్రజావా ణికి 575 ఫిర్యాదులు వచ్చాయి. నోడల్ అధికారి దివ్య దేవరాజన్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి వారి నుంచి ఫిర్యాదులను తీసుకున్నారు. వాటిలో రెవెన్యూ విభాగానికి సంబం ధించి 85, హౌసింగ్‌‌‌‌‌‌‌‌కు 64, వినియోగ దారుల వ్యవహారాలు, ఆహారం, పౌర సరఫరాలకు సంబంధించి 50, పంచా యితీ రాజ్, గ్రామీణ అభివృద్ధికి 43, హోం శాఖకు 42 ఫిర్యాదులు వచ్చాయి. వాటిలో ముఖ్యంగా ఓయూ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ 12 యూనివర్సి టీలకు చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ల బృందం చిన్నారెడ్డిని కలిసింది.