తిమ్మాపూర్(మానకొండూర్), వెలుగు: పెద్దపల్లి జిల్లా రామగుండం నుంచి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి హైదరాబాద్ కు వెళ్లే మెయిన్ పైప్‌లైన్ పగిలిపోవడంతో నీళ్లు భారీగా ఎగిసిపడ్డాయి. కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం జగ్గయ్యపల్లి శివారులో శుక్రవారం ఉదయం పైప్‌లైన్ పగిలి నీళ్లు ఎగిసిపడడంతో ఆ ప్రాంతమంతా భారీ వాటర్ ఫౌంటేన్‌ను తలపించింది.
విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. మెయిన్ పైప్ లైన్ పగలడంతో మరో మూడు లైన్లకు నీటి సప్లై నిలిపివేసినట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. రిపేర్లు చేసి నీటి సరఫరా పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు
