ఆదిలాబాద్టౌన్, వెలుగు: నకిలీ పత్రాలు సృష్టించి స్థలం ఆక్రమించేందుకు యత్నించిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు మావల సీఐ కర్ర స్వామి తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలోని భుక్తాపూర్ కు చెందిన పోలవేని గంగుబాయికి ప్రభుత్వం 2013లో 2013లో ఆదిలాబాద్ తహసీల్దార్ మావల గ్రామ శివారులోని సర్వే నం.170 లో ప్లాట్ ను కేటాయించారు.
ఆమె స్థలంలో బేస్‌మెంట్ కట్టుకోగా, రాళ్లబండి సృజన్ నిర్మాణాన్ని ధ్వంసం చేసి, నకిలీ పట్టా పత్రాలతో స్థలం తనదేనని బెదిరించాడు. దీనిపై బాధితురాలు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు.
