హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ వేర్ హౌసింగ్ (గోదాముల) మార్కెట్ 2025 లో 3.4 మిలియన్ చదరపు అడుగుల లావాదేవీలను నమోదు చేసింది. ఇది 2024 లో నమోదైన 3.5 మిలియన్ చదరపు అడుగుల కంటే 5 శాతం తక్కువ. అయినప్పటికీ నగర మార్కెట్ స్థిరంగా ఉందని రియల్ఎస్టేట్ కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది.
దీని రిపోర్ట్ ప్రకారం.. మొత్తం లావాదేవీల్లో గ్రేడ్ ‘ఏ’ గిడ్డంగుల వాటా 55 శాతం ఉంది. పరిశ్రమల వారీగా చూస్తే థర్డ్‌పార్టీ లాజిస్టిక్స్(3పీఎల్) తో పాటు ఇతర తయారీ రంగాలు కలిపి 66 శాతం వాటాను ఆక్రమించాయి. ఈ–కామర్స్ రంగం 21 శాతం వాటాతో రెండోస్థానంలో ఉంది.
మొత్తం లావాదేవీల్లో గిడ్డంగుల అవసరాలు 92 శాతంగా ఉండగా, మిగిలిన 8 శాతం పారిశ్రామిక కార్యకలాపాలు నమోదయ్యాయి. అద్దెలు నెలకు చదరపు అడుగుకు రూ.20.7 నుంచి రూ.21.5 కి పెరిగాయి. పటాన్ చెరు క్లస్టర్‌లో అత్యధికంగా రూ.24 నుంచి రూ.28 వరకు అద్దె ఉంది.
