హరీశ్పై కవిత ఫిర్యాదు చేయాలి : బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి

హరీశ్పై కవిత ఫిర్యాదు చేయాలి : బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి
  • నేను తోడొస్తా: బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి 

హైదరాబాద్, వెలుగు: మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన తప్పులపై ఆధారాలు ఉంటే దర్యాప్తు సంస్థలకు ఎమ్మెల్సీ కవిత ఫిర్యాదు చేయాలని బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేశ్ రెడ్డి అన్నారు. కవిత సరైన ఆధారాలతో హరీశ్ పై కంప్లయింట్ చేస్తానంటే ఆమెతో పాటు తాను తోడుగా వెళ్తానని చెప్పారు. కవిత రాజీనామాను మండలి చైర్మన్ వెంటనే ఆమోదించాలని, లేదంటే చట్టసభలపైన ప్రజలకు నమ్మకం పోతుందన్నారు. శుక్రవారం అసెంబ్లీలోని బీజేపీఎల్పీ ఆఫీసులో ఆయన చిట్‌చాట్‌ చేశారు. 

సభలో ప్రజా సమస్యలపై చర్చించకుండా బీఆర్ఎస్ పారిపోతోందని ఎద్దేవా చేశారు. తమ హయాంలో జరిగిన అవినీతి బయటపడుతుందన్న భయంతోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సాకులు వెతికి వాకౌట్ చేస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీలో కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని.. గంటల తరబడి ఎంఐఎం సభ్యులకే మైక్ ఇస్తున్నారని మండిపడ్డారు. దోపిడీ కోసం నాడు కేసీఆర్ కాళేశ్వరం కడితే.. నేడు రేవంత్ రెడ్డి మూసీ ప్రాజెక్టును ఎంచుకున్నారని విమర్శించారు.