బీజాపూర్: ఛత్తీస్గడ్లోని బస్తర్ ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. కొంటా కిస్సారం అడవుల్లో జరిగిన ఈ ఎన్‌కౌంటర్లో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్లో 14 మంది మావోయిస్టులు మృతి చెందారు.
కొంటా ఏరియా కమిటీ సభ్యులు ఒక్కరు కూడా మిగల్లేదు. ఈ కమిటీ సభ్యులు అందరూ చనిపోయారు. మూడు AK47లతో పాటు భారీగా ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శనివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. ఇద్దరు నక్సలైట్ల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG) బలగాలకు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. ఛత్తీస్ గడ్ మావోయిస్టుల కదలికల మూలాన చివురుటాకులా వణికిపోతోంది. నిత్యం ఏదో ఒక చోట భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరుగుతూనే ఉన్నాయి.
బీజాపూర్ ప్రాంతంలో అయితే జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. ఒక్క 2025లోనే ఛత్తీస్ గడ్ ప్రాంతంలో 280 మందికి పైగా మావోయిస్టులు మృతి చెందారు. వీళ్లలో ఎక్కువ మంది బీజాపూర్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్లలోనే చనిపోవడం గమనార్హం.
