- ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
రామచంద్రాపురం, వెలుగు: తెల్లాపూర్ పరిధిలోని వెలిమెల సరోజినమ్మ గుట్టకు ఎంతో చారిత్రాత్మక చరిత్ర ఉందని, త్వరలోనే సరోజినమ్మ గుట్టను పర్యాటక కేంద్రంగా మారుస్తామని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తెలిపారు. శుక్రవారం గుట్ట జాతర సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతికి జాతరలు ప్రతీకలుగా నిలుస్తున్నాయన్నారు.
ఇప్పటికే గుట్టపైన ఆలయం వరకు సీసీ రోడ్డు నిర్మించామని తెలిపారు. ప్రభుత్వాధికారులతో మాట్లాడి సరోజినమ్మ గుట్టకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ రాములు గౌడ్, మాజీ కౌన్సిలర్లు రవీందర్ రెడ్డి, సుచరిత కొమురయ్య, రాజ్ కుమార్, ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.
