- గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి
తూప్రాన్, వెలుగు: ప్రజల ఇబ్బందులు తీర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పలు అభివృద్ధి పనులు చేపడుతూ, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తోందని గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి అన్నారు. శుక్రవారం తూప్రాన్ పట్టణంలో రూ.15 కోట్లతో చేపట్టనున్న సీసీ రోడ్లు,అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సెంట్రల్ లైటింగ్ పనులకు మున్సిపల్ కమిషనర్ గణేశ్ రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో, సీఎం రేవంత్ రెడ్డి ప్రతి మున్సిపాలిటీకి నిధులు శాంక్షన్ చేస్తున్నారన్నారు.
అందులో భాగంగా తూప్రాన్ పట్టణంలోని ఒక్కో వార్డుకు రూ.50 లక్షల విలువైన పనులకు శంకుస్థాపన చేశామన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలన్నారు. కార్యక్రమంలో నాచారం దేవాలయ చైర్మన్ రవీందర్ గుప్తా, ఏఈ మధు, మామిండ్ల కృష్ణ, నందాల శ్రీనివాస్, నారాయణ, భగవాన్ రెడ్డి, దీపక్ రెడ్డి, తదితరులున్నారు.
