రాయిలాపూర్ లో లిక్కర్ అమ్మకాలు బంద్.. మైనర్లకు సిగరెట్లు అమ్మొద్దని గ్రామ సభలో తీర్మానం

రాయిలాపూర్ లో  లిక్కర్ అమ్మకాలు బంద్.. మైనర్లకు సిగరెట్లు అమ్మొద్దని గ్రామ సభలో తీర్మానం

రామాయంపేట, వెలుగు: గ్రామంలో లిక్కర్ అమ్మకాలు పూర్తిగా నిషేద్ధమని, ఒకవేళ అమ్మితే రూ.ఒక లక్ష జరిమానా విధిస్తామని మెదక్ జిల్లా రామాయంపేట  మండలం రాయిలా పూర్ గ్రామ పంచాయితీ పాలకవర్గం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. సర్పంచ్ గట్టు సుశీల అధ్యక్షతన శుక్రవారం గ్రామ సభ నిర్వహించారు. గ్రామంలో లిక్కర్, సిగరేట్ అమ్మకాలపై  నిషేధం విధించారు. 

ముఖ్యంగా 18 ఏండ్లలోపు పిల్లలకు సిగరెట్లు అమ్మొద్దని, రాష్  డ్రైవింగ్, ఓవర్ స్పీడ్​గా డ్రైవ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. సభలో ఉప సర్పంచ్. ప్రశాంత్ వార్డు సభ్యులు మహేష్, రా ములు, సునీత, శంకర్ తదితరులు ఉన్నారు.