సాయి లిఖిత మృతిపై విచారణ జరిపించాలి : పీడీఎస్యూ

సాయి లిఖిత మృతిపై విచారణ జరిపించాలి : పీడీఎస్యూ
  • పీడీఎస్​యూ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కు వినతిపత్రం అందజేత

ఆర్మూర్, వెలుగు : మెండోరా మండలం పోచంపేట్ గ్రామంలోని సోషల్ వెల్ఫేర్​ రెసిడెన్షియల్​లో 8వ తరగతి చదువుతున్న సాయి లిఖిత మృతిపై సమగ్ర విచారణ జరిపించాలని పీడీఎస్​యూ ఆర్మూర్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియాను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం పీడీఎస్​యూ జిల్లా అధ్యక్షుడు ఎం.నరేందర్ వారి కుటుంబ సభ్యులతో  కలిసి మాట్లాడుతూ సాయి లిఖిత హాస్టల్​లో అనారోగ్యంతో బాధపడుతున్నా ఇన్​చార్జి ప్రిన్సిపాల్, సిబ్బంది పట్టించుకోకపోవడం వల్లే ఆమె మృతి చెందిందని ఆరోపించారు.

తీవ్ర అస్వస్థతకు గురైన తర్వాత సమాచారం ఇవ్వడంతో నిర్మల్ హాస్పిటల్​ లో చేర్పించగా డెంగ్యూ సోకిందని హాస్పిటల్​లో రిపోర్ట్ ఇచ్చారని, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించగా అక్కడ మృతి చెందిందని తెలిపారు. స్టూడెంట్ మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి రూ. 50 లక్షల ఎక్స్​ గ్రేషియా చెల్లించాలని, బాధిత కుటుంబంలో ఒకరికి అర్హతకు తగ్గట్టు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్​ చేశారు. కార్యక్రమంలో పీడీఎస్​యూ ఆర్మూర్ ఏరియా అధ్యక్ష కార్యదర్శులు నిఖిల్ రాజు, విద్యార్థి తల్లిదండ్రులు లింగన్న, లక్ష్మి , మామయ్య సాయినాథ్  తదితరులు పాల్గొన్నారు.