నిజామాబాద్నగర ఓటర్లు 3,44,756

నిజామాబాద్నగర ఓటర్లు 3,44,756

నిజామాబాద్‌‌‌‌, వెలుగు :  నిజామాబాద్​‌‌‌‌నగర పాలక సంస్థ పరిధిలోని ముసాయిదా ఓటర్‌‌‌‌‌‌‌‌ లిస్టును శుక్రవారం ప్రకటించారు. గురువారం ఉదయం మొదలుపెట్టిన కసరత్తు అర్ధరాత్రి 2 గంటల వరకు కొనసాగించి 60 డివిజన్లలో 3,44,756 మంది ఓటర్లు ఉన్నట్లు తేల్చారు.

మహిళా ఓటర్లు 1,78,797 మంది కాగా, పురుష ఓటర్లు 1,65,916 మంది, ఇతరులు 43 మంది ఉన్నారు.  ముసాయిదా ఓటర్‌‌‌‌‌‌‌‌ లిస్టుపై ఈనెల 5న రాజకీయ పార్టీల నేతలతో కమిషనర్‌‌‌‌‌‌‌‌ దిలీప్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌ ‌‌‌‌మీటింగ్‌‌‌‌ నిర్వహించనున్నారు. 6న అధికారులతో సమావేశం పూర్తయ్యాక 10న ఫైనల్‌‌‌‌‌‌‌‌ ఓటరు లిస్ట్​ను ప్రకటిస్తారు.