ఇండియన్ దిగ్గజ నటులు ‘కమల్-రజనీ’ కాంబోలో ఓ సినిమా (Thalaivar 173) వస్తున్న విషయం తెలిసిందే. కమల్ హాసన్ నిర్మాణ సంస్థ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మిస్తున్నారు. అయితే, తొలుత దర్శకుడిగా ప్రకటించిన సుందర్.సి హఠాత్తుగా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం సినీ ఇండస్ట్రీలో తీవ్ర చర్చనీయాంశగా మారింది.
ఈ క్రమంలోనే 'తలైవర్ 173' ప్రాజెక్టును డైరెక్ట్ చేయబోయే మేకర్స్పై, రకరకాల రూమర్స్ వినిపించాయి. లోకేష్ కనగరాజ్, కార్తిక్ సుబ్బరాజ్, హీరో ధనుష్ లాంటి యువ దర్శకుల పేర్లు వినిపిస్తూ వచ్చాయి. దీంతో ఈ ప్రాజెక్ట్‌ను డైరెక్ట్ చేయబోతున్నారనే ఆసక్తి కంటిన్యూ అవుతూ వచ్చింది. ఇక ఈ సస్పెన్స్కి ఎండ్ కార్డ్ వేస్తూ కమల్ హాసన్ అప్డేట్ ఇచ్చారు.
►ALSO READ | Jana Nayagan Audio Launch: ఓటీటీలో దళపతి జన నాయగన్ ఆడియో లాంచ్ ఈవెంట్.. స్ట్రీమింగ్ డేట్, టైమ్ వెల్లడి
లేటెస్ట్గా 'తలైవర్ 173' డైరెక్టర్ కుర్చీలో కూర్చునే ఆ దర్శకుడు ఎవరనేది క్లారిటీ వచ్చింది. శనివారం (జనవరి 3న) 'తలైవర్ 173' మూవీ నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది చిత్రబృందం. ఇందులో సినిమాకు పనిచేసే మేకర్స్పై క్లారిటీ ఇస్తూ పోస్ట్ చేసింది.
ఈ సినిమాను తమిళ క్రేజీ డైరెక్టర్ సిబి చక్రవర్తి డైరెక్ట్ చేయనున్నట్లు తెలిపింది. తమిళంలో శివకార్తికేయన్ హీరోగా వచ్చిన డాన్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడే ఈ సిబి చక్రవర్తి. "మెర్సల్" (Mersal), "తెరి" (Theri) వంటి చిత్రాలకు అట్లీ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేశాడు. ఇతను నానితో ఒక సినిమా కూడా చేయాల్సి ఉంది, కానీ అది ప్రస్తుతం వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఇకపోతే, ఈ 'తలైవర్ 173' సినిమాకు సెన్షేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు.
Celebrations begin#Arambikalama #Thalaivar173 #SuperStarPongal2027 @rajinikanth @Dir_Cibi @anirudhofficial #Mahendran @APIfilms @homescreenent@RKFI @turmericmediaTM @magizhmandram pic.twitter.com/abzvPfuEf9
— Kamal Haasan (@ikamalhaasan) January 3, 2026
సుందర్.సి నిష్క్రమణ వెనుక ఏం జరిగింది?
నిజానికి 'జైలర్ 2' తర్వాత ఈ సినిమా పనులు వేగవంతం కావాల్సి ఉంది. కానీ, దర్శకుడు సుందర్.సి ఊహించని పరిస్థితుల కారణంగా ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ చిత్రానికి డైరెక్షన్ వహించే స్థానం ఖాళీ అయ్యింది. 1997లో రజనీకాంత్‌తో 'అరుణాచలం', 2003లో కమల్ హాసన్‌తో 'అన్బే శివం' వంటి క్లాసిక్స్ తీసిన సుందర్.సి ఇలా మధ్యలో వైదొలగడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీనికి కారణం సుందర్ చెప్పిన హారర్ జానర్ కథ రజనీకాంత్‌కు పూర్తి సంతృప్తి కలిగించకపోవడంతోనే ఈ మార్పు జరిగిందని సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
ఊహించని దాన్ని ఆశించండి..
దర్శకత్వం నుంచి సుందర్.సి తప్పుకోవడంపైన నటుడు, నిర్మాత కమల్ హాసన్ స్పందించారు. సుందర్.సి తన నిర్ణయానికి గల కారణాలను ఇప్పటికే పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారని చెప్పారు. అయితే, తాను నిర్మాతగా రజనీకాంత్ సంపూర్ణంగా విశ్వసించే కథతోనే సినిమా తీయాలని భావిస్తున్నట్లు స్పష్టం చేశారు. రజనీకాంత్‌కు నచ్చేంత వరకు మేము కథల వేట కొనసాగిస్తాం అని చెప్పారు.
