ట్రంప్ సుంకాల రద్దు ఎఫెక్ట్.. పసిడి రూ.3 వేలు జంప్..రూ.8 వేలు పెరిగిన వెండి

ట్రంప్ సుంకాల రద్దు ఎఫెక్ట్.. పసిడి రూ.3 వేలు జంప్..రూ.8 వేలు పెరిగిన వెండి

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ విధించిన సుంకాలను అక్కడి సుప్రీంకోర్టు రద్దు చేయడంతో  పెరిగిన అంతర్జాతీయ అనిశ్చితి వల్ల దేశీయ మార్కెట్లలో బంగారం వెండి, ధరలు భారీగా పెరిగాయి. 

సోమవారం ఢిల్లీలో కిలో వెండి ధర రూ.ఎనిమిది వేలు పెరిగి రూ.2.72 లక్షలకు చేరుకుంది. పసిడి ధర 10 గ్రాములకు రూ.3,300 పెరిగి రూ.1.62 లక్షల వద్ద ముగిసింది. సురక్షిత పెట్టుబడిగా భావించే ఈ లోహాలకు డిమాండ్ పెరగడం వల్ల మూడు వారాల గరిష్టానికి ఇవి చేరాయి. అంతర్జాతీయ మార్కెట్లో కూడా వెండి 2.2 శాతం,  బంగారం ఒక శాతం మేర లాభపడ్డాయి.