Jana Nayagan Audio Launch: ఓటీటీలో దళపతి జన నాయగన్ ఆడియో లాంచ్ ఈవెంట్.. స్ట్రీమింగ్ డేట్, టైమ్ వెల్లడి

Jana Nayagan Audio Launch: ఓటీటీలో దళపతి జన నాయగన్ ఆడియో లాంచ్ ఈవెంట్.. స్ట్రీమింగ్ డేట్, టైమ్ వెల్లడి

తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ (Thalapathy Vijay) అప్ కమింగ్ రిలీజ్ మూవీ ‘జన నాయగన్’ (తెలుగులో ‘జన నాయకుడు’). సంక్రాంతి స్పెషల్గా (2026 జనవరి 9న) థియేటర్లలోకి ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఇటీవలే (2025 డిసెంబర్ 28న) మలేషియాలోని కౌలాలంపూర్‌లో జ‌న‌నాయ‌గ‌న్ ఆడియో లాంచ్ వేడుక గ్రాండ్గా జరిగింది.

ఈ వేడుకకు ఏకంగా ఒక లక్ష మంది హాజరయ్యారు. ఇది 'మలేషియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్'లో కూడా ఎక్కింది. ఈవెంట్‌లో విజ‌య్ మాట్లాడిన మాటలు ఒక చారిత్రక ఘట్టంగా నిలిచిపోయాయి. జన నాయగన్ సినిమానే తన చివరి సినిమా అని విజ‌య్ ప్ర‌క‌టించి అందరూ ఎమోషనల్ అయ్యారు చేశారు విజయ్.

అయితే, ఆ ఈవెంట్‌ను మలేషియా ఆడియో లాంచ్ నిర్వాహకులు లైవ్ స్ట్రీమింగ్ చేయలేదు. కేవలం సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో మాత్రమే చిన్న చిన్న వీడియోలుగా వైరల్ అయ్యాయి. దీంతో విజయ్ మాట్లాడిన పూర్తి స్పీచ్‌ను, డ్యాన్స్ను చూడాలనే ఆసక్తితో ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ఈ క్రమంలోనే, ఈ చారిత్రక వేడుకను పాన్ ఇండియా భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రముఖ ఓటీటీ జీ5 ప్లాట్‌ఫామ్ తాజాగా ప్రకటించింది. ‘జన నాయగన్’ ఆడియో లాంచ్ ఈవెంట్‌ను ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు వెల్లడించింది. ఈ ఈవెంట్ రేపు, ఆదివారం జనవరి 4న సాయంత్రం 4.30 గంటల నుంచి స్ట్రీమింగ్ కానుందని జీ5 అధికారికంగా తెలియజేసింది.

►ALSO READ | Godari Gattupaina Teaser: సుమంత్ ప్రభాస్ ‘గోదారి గట్టుపైన’ టీజర్ వచ్చేసింది.. ఎలా ఉందో చూడండి..!

“బిగ్గెస్ట్ సౌత్ ఈవెంట్ ఆఫ్ ద ఇయర్.. ఒక ఐకాన్. ఒక చివరి గర్జన. ఒక మరచిపోలేని రాత్రి.. దళపతి తిరువీర జన నాయగన్ ఆడియో లాంచ్ జనవరి 4న జీ5లో ప్రీమియర్ కానుంది” అనే క్యాప్షన్ తో ట్వీట్ చేసింది. ఇకపోతే, ఇది విజయ్ చివరి సినిమా కావడంతో, ఫ్యాన్స్ మరియు సినీ ప్రియుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే, రిలీజైన కంటెంట్స్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. ఈ క్రమంలోనే ఇవాళ సాయంత్రం (జనవరి 3న) 6.45 గంటలకు ట్రైలర్ రిలీజ్ కానుంది. 

నా అభిమానులకు సేవ చేయడం కోసమే సినిమాలకు గుడ్‌ బై చెబుతున్నా అని విజ‌య్ ఎమోషనల్ అయ్యారు.‘‘సినిమాల ద్వారా అభిమానుల నుంచి ఎంతో ప్రేమ, గౌరవం లభించింది. అయితే ఇకపై తన జీవితంలో కొత్త ప్రయాణానికి సిద్ధమవుతున్నాను. ‘జన నాయగన్’ సినిమా పూర్తయ్యాక తాను నటనకు పూర్తిగా వీడ్కోలు పలుకుతున్నాను. సినిమాలకు స్వస్తి చెప్పడం ఎంతో కష్టంగా ఉన్నప్పటికీ, ప్రజలకు పూర్తిస్థాయిలో సేవ చేయాలనే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇన్నాళ్లు నా ఫ్యాన్స్‌, ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లి నేను నటించిన సినిమాలు చూసేవారు. ఎన్నో ఏళ్లుగా నన్ను సపోర్ట్ చేశారు. నా కెరీర్‌లో ఇంత మ‌ద్దతుగా నిలిచిన వారి కోసం, నేను 30 ఏళ్లు నిలబడతా. నా అభిమానులకు సేవ చేయడం కోసమే సినిమాలకు గుడ్‌ బై చెబుతున్నా’’ అని విజ‌య్ ఎమోషనల్ అయ్యారు. విజయ్ చేసిన ఈ ప్రకటనతో తమిళ సినీ పరిశ్రమతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు భావోద్వేగానికి గురయ్యారు.