జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి గ్రహానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. నవగ్రహాలు వివిధ రాశులలో సంచరిస్తూ అనేక యోగాలను ఏర్పరుస్తాయి. 12 సంవత్సరాల తరువాత గురుడు, చంద్రుడు మిధున రాశిలో కలిసి అత్యంత శక్తివంతమైన గజకేసరి రాజయోగాన్ని ఏర్పరుస్తూ ఉన్నారు. జనవరి 3 వ తేది శనివారం ఉదయం 5.32 గంటలకు చంద్రుడు వృషభ రాశి నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించి మిధున రాశిలోకి ప్రవేశించాడు. దీనివల్ల నాలుగు రాశులవారికి అదృష్ట యోగంతో పాటు శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. ఆరాశులతో పాటు మిగతా రాశుల వారికి ఎలా ఉంటుందో ఈ స్టోరీలో తెలుసుకుందాం...!
మేష రాశి: గజకేసరి యోగం వలన ఈ రాశి వారికి వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆదాయానికి లోటు ఉండదు. నూతన వస్తు, వాహనాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కుటుంబ సభ్యులతో పుణ్య క్షేత్రాలు దర్శనం చేసుకుంటారు. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. చేపట్టిన పనులు సమయానికి పూర్తి చేస్తారు. ముఖ్యమైన ఆలోచనలు ఆచరణలో పెడతారు. ఉద్యోగాలలో విజయం సాధిస్తారు. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది.
వృషభరాశి : గజకేసరి రాజయోగం ప్రభావం ఈ రాశి వారిపై అధికంగా ఉంటుంది. వృషభరాశి వారికి ఈ సమయంలో మంచి జీవితాన్ని ఇస్తుంది. పాత బకాయిలు వసూలవుతాయి. అప్పుగా ఇచ్చి నిలిచిపోయిన డబ్బు వారికి చేతికి తిరిగి వస్తుంది. గత పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారని పండితులు చెబుతున్నారు. గజకేసరి యోగం వలన ఈ రాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్, జీతం పెరుగుదల వంటివి కనిపిస్తాయి. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది.
మిథునరాశి: ఈ రాశి వారికి కొత్త ఏడాది (2026) ప్రారంభమైన రెండు రోజులకే ఇదే రాశిలో గజకేసరి యోగం ఏర్పడటం వలన మంచి రోజులు మొదలవుతాయని జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుస్తుంది. వీరికి ఉద్యోగంలో మంచి పురోగతి ఉంటుంది. ఆత్మవిశ్వాసం పెరగడం... ఉద్యోగంలో, వ్యాపారంలో కూడా కొత్త బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. . సమాజంలో గౌరవం పెరుగుతుంది. పెండింగ్ పనులు పూర్తవుతాయి.
కర్కాటక రాశి: ఈరాశి వారికి అన్ని సమస్యలు పరిష్కారమవుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ప్రధానంగా ఆరోగ్య సమస్యలు పరిష్కారమవుతాయి. అప్పుల సమస్య కూడా తగ్గుతుంది. ఈ సమయంలో పెట్టుబడి లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగస్తులు అనవసరంగా మాట పడాల్సిన పరిస్థితులు వచ్చే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు. వ్యాపారస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ప్రేమ, పెళ్లి స్రయత్నాలు ఫలిస్తాయి.
సింహరాశి: గజకేసరి యోగం ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తుంది. అనేక రంగాలలో ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఉద్యోగం, వ్యాపారం చేసేవారు ప్రయోజనాలను పొందుతారు. బోధన, రాజకీయ మరియు పరిపాలన రంగాలలో ఉన్నవారి ప్రసంగం ఆకట్టుకునేలా ఉంటుంది. వీ వారు ఇతరులకు స్ఫూర్తిని ఇస్తారు. ఉద్యోగస్తులకు జీతం పెరిగే అవకాశం ఉంది. వ్యాసారస్తులకు గతంలో పెట్టిన పెట్టుబడులనుంచి లాభాలు పొందుతారు.
కన్యారాశి: గజకేసరి యోగం వలన ఈ రాశి వారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. దీర్ఘకాలిక రుణాలు కొంతవరకు తీరుతాయి. వ్యాపారాల్లో లాభాలు కలుగుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ప్రయాణాలు లాభసాటిగా ఉంటాయి. మిత్రులతో ముఖ్యమైన విషయాలు చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. బంధుమిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ వాతావరణం సంతోషకరంగా ఉంటుంది.
తులారాశి: ఈ రాశి వారు గజకేసరి యోగం వల్ల ఎంతో లాభపడే అవకాశం ఉంది. ఈ రాశికి చెందిన వ్యాపారస్తులు అధిక లాభాలు పొందుతారు. కొత్త ప్రాజెక్ట్లు చేపట్టే అవకాశం ఉంది. వీరికి ఆర్థిక లాభాలు కలుగుతాయి. . ఈ రాశివారు గట్టిగా ప్రయత్నిస్తే విదేశీ ప్రయాణం సాధ్యమవుతుంది. ఇక వీరి కెరీర్‌లో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి.. ప్రేమ .. పెళ్లి వ్యవహారాలు కలసి వస్తాయి.
వృశ్చికరాశి:ఈ రాశి వారికి గజకేసరి యోగం వలన ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. పూర్వీకుల ఆస్తి చేతికి అందుతుంది. సొంత ఇంటి కల నెరవేరుతుంది. వాహన యోగం కలుగుతుంది. కుటుంబంలో శుభ కార్యాలు జరుగుతుంది. ఆస్తుల విలువ బాగా పెరుగుతుంది. ఉద్యో గంలో స్థిరత్వం లభిస్తుంది. జీవనశైలి పూర్తిగా మారిపోతుంది. ఇష్టమైన ప్రదేశాలను సందర్శిస్తారు.
ధనుస్సు రాశి: మిథునరాశిలో గురు, చంద్రుడు కలిసి గజకేసరి యోగం ఏర్పడటం వలన ఈ రాశి వారికి అసాధారణ ఫలితాలను ఇస్తుంది. దీర్ఘకాలిక ప్రణాళికలు అమలు చేస్తారు. విద్య, ఉద్యోగం, వ్యాపార రంగాల్లో పురోగతి సాధిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అనుకూల గ్రహ స్థితి కారణంగా ఆదాయ వృద్ధి ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతారు. పాత పనులన్నీ కలిసి ఇప్పుడు లాభాలను అందిస్తాయి. అనుకోకుండా సెలబ్రిటీల పరిచయం పెరుగుతుంది. ఈ సమయంలో పిల్లలు అభివృద్ధి చెందుతారు.
మకర రాశి: ఈ రాశివారికి సుఖ సంతో షాలకు లోటుండదు. గృహ, వాహన యోగాలు పట్టే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో ప్రతిభా పాటవాలకు ఆశించిన గుర్తింపు లభించడంతో పాటు హోదా కూడా పెరిగే సూచనలున్నాయి. మాతృ సౌఖ్యం లభిస్తుంది. తల్లి ఆరోగ్యం బాగా మెరుగ్గా ఉంటుంది. సామాజికంగా మాటకు, చేతకు విలువ పెరుగుతుంది. సమస్యలు తగ్గి మానసిక ప్రశాంతత కలుగుతుంది
కుంభరాశి: ఈ రాశి వారికి గజకేసరి రాజయోగం అదృష్టం వరించే అవకాశం ఉంది. ఈ రాశి వారి ఆర్థిక స్థితి వేగంగా మెరుగుపడుతుంది. వృధా ఖర్చులు తగ్గుతాయి. పొదుపు చేయడంలో వీరు విజయం సాధిస్తారునూతన ఆదాయ వనరులు ఏర్పడుతాయి. విద్యార్థులు ప్రయోజనాలను పొందుతారు. ఉన్నత విద్యను పొందాలనుకునే వారి కల నెరవేరుతుంది. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. వ్యాపారస్తులు గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు పొందుతారు. కొత్త ఉద్యోగాలు లేదా వ్యాపారాలు ప్రారంభించాలి అనుకునే వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ కాలంలో చేపట్టిన పని అపారమైన విజయాలను, లాభాలను ఇస్తుంది.
మీనరాశి: గజకేసరి యోగం వలన ఈ రాశి వారికి మేలు జరుగుతుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. ఏ ప్రయత్నం చేసినా విజయం లభిస్తుంది. సొంత ఇల్లు, విదేశీ ఉద్యోగ కల నెరవేరుతుంది. సంతానం కలుగుతుంది. ఆదాయం బాగా పెరుగుతుంది. వ్యాపారస్తులకు ఆదాయం పెరుగుతుంది.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించలేదు. మీకున్న వాస్తు, జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
