జర్నలిస్టుల అక్రిడిటేషన్ల సమస్యను ప్రభుత్వానికి తెలియజేస్తాం : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి

జర్నలిస్టుల అక్రిడిటేషన్ల సమస్యను ప్రభుత్వానికి తెలియజేస్తాం : ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
  •     ఎమ్మెల్యే గూడెం మహిపాల్​ రెడ్డి 

అమీన్​పూర్​(పటాన్​చెరు), వెలుగు:  జర్నలిస్టుల అక్రిడిటేషన్ సమస్యలను ప్రభుత్వానికి తెలియజేస్తామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్​రెడ్డి తెలిపారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్​ 252ను సవరించాలని డిమాండ్​ చేస్తూ టీయూడబ్ల్యూజే హెచ్​143 చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వాలని ఉమ్మడి మెదక్​ జిల్లా టీయూడబ్ల్యూజే  ప్రధాన కార్యదర్శి యాదగిరిగౌడ్​ ఆధ్వర్యంలో జర్నలిస్టులు ఎమ్మెల్యే గూడెం మహిపాల్​రెడ్డికి శుక్రవారం పటాన్​చెరు క్యాంపు కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. గతంలో ఉన్న 239 జీవో ఆధారంగా 23 వేల కార్డులు రాగా నూతనంగా తీసుకొచ్చిన జీవోతో 13 వేల కార్డులు  తగ్గనున్నాయని వివరించారు.

  ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న తరుణంలో ఈ అంశంపై  శాసనసభలో  చర్చించి ప్రభుత్వానికి సూచనలు చేసి జీవోను సవరించేల జర్నలిస్టులకు మద్దతుగా నిలవాలని జర్నలిస్టు నాయకులు కోరారు. స్పందించిన ఎమ్మెల్యే జర్నలిస్టులకు న్యాయం జరిగేలా ప్రభుత్వానికి విషయాన్ని వివరిస్తానని తెలిపారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో టీయూడబ్ల్యూజే హెచ్​143 జిల్లా ఉపాధ్యక్షులు రాఘవరెడ్డి, నారాయణ, జింకల శ్రీనివాస్​, కిశోర్​, ప్రేమ్​కుమార్​, మన్నె కుమార్​, అంజయ్​ పాల్గొన్నారు.