న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో ఢిల్లీలో బంగారం ధర శుక్రవా రం రూ.1,100 పెరిగి రూ.1.39,440కి చేరింది. కిలో వెండి రూ.నాలుగు వేలు పెరిగి రూ.2,41,400కి చేరింది. అమెరికా వడ్డీ రేట్లను తగ్గించవచ్చనే అంచనాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ధరల పెరుగుదలకు ప్రధాన కారణమయ్యాయి.
అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ 1.56 శాతం పెరిగి 4,392,94 డాలర్లకు చేరింది. వెండి కూడా 4.28 శాతం వృద్ధితో 74.52 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. రష్యా, ఉక్రెయిన్ మధ్య ఘర్షణలు మళ్లీ పెరగడం వల్ల ఇన్వెస్టర్లు బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు.
