బోయినిపల్లి, వెలుగు: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం కొదురుపాక సర్పంచ్ మంజుల మలేషియాలో ఫెలోషిప్ పోస్ట్ డాక్టరేట్ సీట్ పొందారు. కరీంనగర్ లోని జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్ గా పని చేస్తూ ఇటీవల జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి కొదురుపాక సర్పంచ్ గా ఎన్నికయ్యారు. 2020లో జేఎన్టీయూహెచ్ లో పీహెచ్డీ పూర్తి చేశారు. ప్రస్తుతం మలేషియాలోని లింకన్ యూనివర్సిటీలో పోస్ట్ డాక్టరేట్ ఫెలోషిప్ పొందడంతో కాలేజీ యాజమాన్యం, స్టాఫ్, గ్రామస్తులు ఆమెను అభినందించారు.
