ఏపీలో కొత్తగా 58 కేసులు నమోదు

ఏపీలో కొత్తగా 58 కేసులు నమోదు
  •  1583కి చేరిన కేసుల సంఖ్య

అమరావతి: ఏపీలో కరోనా బాధితుల సంఖ్య 1583కి చేరింది. గడిచిన 24 గంటల్లో 6534 శాంపిల్స్‌ను పరీక్షించగా 58 మందికి కరోనా పాజటివ్‌ వచ్చిందని ఆదివారం బులిటెన్‌ రిలీజ్‌ చేశారు. 488 మంది వ్యాధి నుంచి కోలుకోగా.. 33 మంది చనిపోయారు. 1062 మంది ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నారు. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 33 కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో కేసుల సంఖ్య 466కు చేరింది. గుంటూరు జిల్లాలో 319 ఉండగా.. కృష్ణా జిల్లాలో 266 కేసులు ఉన్నాయి.

జిల్లాల వారీగా వివరాలు