కాప్రాలో 6 సెంటీ మీటర్ల వాన

కాప్రాలో 6 సెంటీ మీటర్ల వాన

గ్రేటర్​ పరిధిలోని పలు ప్రాంతాల్లో సోమవారం వర్షం కురిసింది. అత్యధికంగా కాప్రాలో 6, కుత్బుల్లాపూర్ లో 1.2 సెంటీమీటర్ల వాన పడింది. మిగిలిన ప్రాంతాల్లో జల్లులు కురిశాయి. సిటీలో మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. బుధ, గురువారాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

- హైదరాబాద్, వెలుగు