Beauty Tips: ముఖం కడుక్కునేటప్పుడు ఈ మిస్టేక్స్ అస్సలు చేయొద్దు...!

Beauty Tips: ముఖం కడుక్కునేటప్పుడు ఈ మిస్టేక్స్ అస్సలు చేయొద్దు...!

కొంతమంది పదేపదే ముఖం కడుక్కోవడం. మసాజ్ చేసుకోవడం లాంటివి చేస్తుంటారు. ఆ క్రమంలో తెలిసీ తెలియక కొన్ని మిస్టేక్స్ చేస్తుంటారు. అవేంటంటే...

  • ముఖం కడుక్కునే ముందు తప్పనిసరిగా చేతులు కడుక్కోవాలి. లేదంటే చేతులకున్న మురికి, పైన పేరుకుపోయిన బ్యాక్టీరియా వంటివి చర్మంపై ప్రభావం చూపుతాయి.
  • పొడి చర్మం వాళ్లు ముఖాన్ని సబ్బుతో కడగొద్దు. సబ్బులో ఉండే కెమికల్స్ చర్మాన్ని ఇంకా పొడిబారేలా చేస్తాయి. తేనె, అరటిపండుతో మర్దన చేసుకుని స్నానం చేయాలి. తరచూ మాయిశ్చరైజర్లు రాయాలి. డాక్టర్ల సలహా మేరకు ఫేస్ వాష్ ఎంచుకోవాలి.
  • క్లెన్సర్లు, స్క్రబ్ లు ఎక్కువగా వాడటం వల్ల చర్మం నిర్జీవంగా మారుతుంది. అందుకని తరచూ అవి వాడడం మానేయాలి. అలాగే ముఖం శుభ్రం చేసుకోవడానికి అతి చల్లగా, మరీ వేడిగా ఉన్న నీళ్ల జోలికి వెళ్లకపోవడం మంచిది.