
మహారాష్ట్రలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఛత్రపతి శంభాజీ నగర్‌లోని హ్యాండ్ గ్లోవ్‌ల తయారీ కంపెనీలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ అగ్నిప్రమాదం జరగగా ఆరుగురు కార్మికులు సజీవదహనమయ్యారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులకు స్థానిక ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ఇందులో కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తుంది.
#WATCH | Chhatrapati Sambhajinagar, Maharashtra: Fire breaks out in a factory in the Waluj MIDC area. Operations to douse the fire are underway. Further details awaited. pic.twitter.com/mY9ChJv8n8
— ANI (@ANI) December 30, 2023
ఈ సంఘటనపై వెంటనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని చర్యలు చేపట్టింది. ఉదయం 7 గంటల వరకు మంటలు అదుపులోకి వచ్చాయి. ఆదివారం తెల్లవారుజామున 2:15 గంటల సమయంలో ఫ్యాక్టరీలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మంటలు ప్రారంభమైన కొద్దిసేపటికే ఆ హ్యండ్ గ్లవ్స్ తయారీ కంపెనీ మొత్తం అగ్నికి ఆహుతైంది.
అగ్నిప్రమాదం జరిగిన టైమ్ లో దాదాపు 10-15 మంది భవనంలో చిక్కుకున్నారని స్థానికులు తెలిపారు. ఈ అగ్నిప్రమాదం జరగడానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రమాదానికి దారితీసిన కారణాలపై విచారణ జరుపుతున్నామని పోలీసు అధికారులు తెలిపారు.