కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన నిర్మాణ సంస్థ.. ఒకేసారి ఆరు సినిమాల స్క్రిప్టులు లాక్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన నిర్మాణ సంస్థ.. ఒకేసారి ఆరు సినిమాల స్క్రిప్టులు లాక్

భలే మంచిరోజు, ఆనందో బ్రహ్మ, యాత్ర, శ్రీదేవి సోడా సెంటర్ లాంటి చిత్రాలను నిర్మించిన 70 ఎమ్ఎమ్ ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్స్ సంస్థ  కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ఆరు కొత్త సినిమాల స్క్రిప్టులు లాక్ చేస్తూ, ఆదివారం  పూజా కార్యక్రమం నిర్వహించారు.

వచ్చే రెండేళ్లలో ఈ ఆరు సినిమాలను వరుసగా తెరకెక్కించి విడుదల చేయనున్నట్టు తెలియజేశారు. వేర్వేరు జానర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎప్పటిలాగే క్వాలిటీ  స్టోరీటెల్లింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కి ప్రాధాన్యం ఇస్తూ ప్రేక్షకుల్ని అలరించేలా ప్లాన్ చేస్తున్నామని నిర్మాతలు విజయ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చిల్లా, శశి దేవిరెడ్డి అన్నారు. ఈ సినిమాల గురించి కంప్లీట్ డీటెయిల్స్, నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలను త్వరలోనే ప్రకటిస్తామన్నారు.

70 ఎమ్ఎమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ అనేది ఒక తెలుగు చలనచిత్ర నిర్మాణ సంస్థ. ఇది 2015 లో హైదరాబాద్ లో ప్రారంభించబడింది మరియు కమర్షియల్ గా సక్సెస్ అయ్యే సినిమాలను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరీ ఈ కొత్త సినిమాల హీరోలెవరు? కథలు ఎలాంటివనేది త్వరలో తెలిసిపోతుంది.