ప్రసాదం ఫుడ్ పాయిజన్ 600 మంది గ్రామస్థులు ఆసుపత్రి పాలు

ప్రసాదం ఫుడ్ పాయిజన్ 600 మంది గ్రామస్థులు ఆసుపత్రి పాలు

మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో మంగళవారం జరిగిన ఓ ఉత్సవంలో ప్రసాదం ఫుడ్ పాయిజన్ విషాదం చోటు చేసుకుంది. లోనార్ తాలూకాలోని ఖపర్ఖెడ దేవాలయంలో ఫిబ్రవరి 20న జరిగిన జాతరలో ప్రసాదం తిన్న గ్రామస్తులు అనారోగ్యానికి గురయ్యారు. ఈ ఉత్సవంలో 2000 మంది గ్రామస్థులు పాల్గొన్నారు.  వారిలో ప్రసాదం తీసుకున్న 600 మందికి ఒక్కసారిగా వికారం, కల్లు తిరగడం, మూర్ఛ వచ్చి అస్వస్థతకు లోనయ్యారు.. కొంతమంది స్పృహ కోల్పోయారు. 

ప్రసాదం ఫుడ్ పాయిజన్ కావడంతోనే ఇలా జరిగిందని స్థానికులు చెబుతున్నారు. లోనార్, సుల్తాన్‌పూర్‌లోని ఆసుపత్రులకు తరలించారు. ఒక్కసారిగా ఇంతమందికి ఫుడ్ పాయిజన్ అవ్వడంతో ఆ ఊరి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ప్రసాదం తీసుకున్నవారిలో ఉపవాసం చేసున్నవారు కూడా ఉన్నారు. పూజ అనంతరం హారతి తీసుకొని ప్రసాదం స్వీకరించగా ఇలా జరిగింది. ప్రసాదంలో ఏదైనా విష పదార్థం పడిడిందా అని స్థానిక అధికారులు, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.