
పంజాగుట్ట,వెలుగు: మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్లో మంగళవారం జరిగిన ప్రజావాణికి మొత్తం 606 ఫిర్యాదులు వచ్చినట్టు అధికారులు తెలిపారు. రెవెన్యూకు 108, పౌరసరఫరాలకు 106, విద్యుత్ శాఖకు 64, హౌజింగ్కు 115, మైనారిటీ సంక్షేమం 38, ఇతర శాఖలకు సంబంధించి175 ఫిర్యాదులు వచ్చాయి. అహ్మద్గూడకు చెందిన డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ఇండ్లు ఇచ్చినా విద్యుత్, తాగునీటి సౌకర్యం కల్పించలేదని బైఠాయించారు. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, నోడల్అధికారి దివ్య దేవరాజన్ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు.