ఏపీలో 1500 దాటిన కరోనా కేసులు

ఏపీలో 1500 దాటిన కరోనా కేసులు

24 గంటల్లో 62 కొత్త కేసులు

అమరావతి: ఏపీలో కరోనా పాజిటివ్‌ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. 24 గంటల్లో 62 కొత్త కేసులు నమోదైనట్లు అధికారులు శనివారం ప్రకటించారు. దీంతో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 1525కి చేరింది. 24 గంటల్లో 5943 శాంపిల్స్‌ను పరీక్షించామని అధికారులు చెప్పారు. కరోనా బారిన పడి 33 మంది మరణించగా.. 441 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 1051 మంది వివిధ హాస్పిటల్స్‌లో ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నారు. గుంటూరులో 19, పశ్చిమ గోదావరి7, కృష్ణా 7, అనంతపూర్‌‌ 2, చిత్తూరు 2, నెల్లూరు జిల్లా నుంచి ఒకరు డిశ్చార్జ్‌ అయ్యారు.

జిల్లాల వారీగా కేసుల వివరాలు