కాంగ్రెస్కు 64మంది నేతల రాజీనామా

కాంగ్రెస్కు 64మంది నేతల రాజీనామా

గులాం నబీ ఆజాద్కు మద్ధతుగా జమ్మూ కశ్మీర్ లో 64 మంది కాంగ్రెస్ నేతలు రాజీనామా చేశారు. కశ్మీర్ మాజీ డిప్యూటీ సీఎం తారాచంద్ తాజాగా పార్టీకి గుడ్ బై చెప్పారు. రాజీనామా చేసిన వారిలో మాజీ మంత్రులు మనోలాల్ శర్మ, బల్వాన్ సింగ్, అబ్దుల్ మజిద్ సహా పలువురు ఉన్నారు. ఆజాద్కు మద్ధతుగా సోనియాగాంధీకి ఉమ్మడి రాజీనామా లేఖను పంపినట్లు తారా చంద్ తెలిపారు.  సోమవారం నలుగురు నాయకులతో పాటు 12మంది కార్యకర్తలు ఆజాద్ కు మద్ధతుగా కాంగ్రెస్ కు రాజీనామా చేశారు. 

గత శుక్రవారం కాంగ్రెస్కు రాజీనామా చేసిన గులాం నబీ ఆజాద్ కొత్త పార్టీ పెడతానని ప్రకటించారు. రాహుల్ గాంధీ వల్లే కాంగ్రెస్ నాశనమైందని.. ఆయన లీడర్గా సెట్కారని విమర్శించారు. జీ23 నేతలతో కలిసి తాను పార్టీ అధిష్టానానికి లేఖ రాసిన తర్వాత  నిద్రలేని రాత్రులు గడిపానని.. అయితే ఎప్పుడూ కూడా పార్టీకి రాజీనామా చేయాలని అనుకోలేదన్నాడు. కానీ తన ఇంట్లో నుంచి తననే బలవంతంగా వెళ్లిపోయేలా చేశారని ఆజాద్ ఆవేదన వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ నాయకత్వానికి లోపాలను సరిదిద్దుకునే సమయం లేదన్న గులాం నబీ... ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నవారంతా పనికిరానివారని మండిపడ్డారు. రాష్ట్రాల అధ్యక్షులు కాంగ్రెస్ సభ్యులను ఏకం చేయాల్సింది పోయి.. ఇతరను పార్టీని వీడేలా చేస్తున్నారని ఆరోపించారు. మూలుగుతున్న కాంగ్రెస్కు.. డాక్టర్ నుంచి కాకుండా కంపౌండర్ నుంచి మందులు అందుతున్నాయని ఎద్దేవా చేశారు.