ఒక్కరోజే 64,553 కరోనా కేసులు..1007 మరణాలు

ఒక్కరోజే 64,553 కరోనా కేసులు..1007 మరణాలు

దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రతిరోజూ దాదాపు 60 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. నిన్న(ఆగస్టు13) ఒక్కరోజే దేశ వ్యాప్తంగా 64,553 కేసులు నమోదవడంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య మొత్తం 24,61,191కు చేరింది. మరో 1007 మంది చనిపోవడంతో కరోనా మృతుల సంఖ్య 48,040 కు చేరింది.

ఇక ఇప్పటి వరకు కరోనా నుంచి 17,51,556 మంది కోలుకోగా…ఇంకా 6,61,595 మంది  ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఆగస్టు 13న ఒక్కరోజే దేశ వ్యాప్తంగా 8,48,728 టెస్టులు చేశారు. దీంతో ఆగస్టు 13 వరకు దేశంలో కరోనా టెస్టుల సంఖ్య మొత్తం 2,76,94,416కు చేరింది.