ఆరోగ్యలక్ష్మీ మిల్క్‌‌ స్కీమ్‌‌లో రూ.65 లక్షలు గోల్‌‌మాల్‌‌

ఆరోగ్యలక్ష్మీ మిల్క్‌‌ స్కీమ్‌‌లో రూ.65 లక్షలు గోల్‌‌మాల్‌‌
  •      మహిళా శిశు సంక్షేమ శాఖ ఆఫీసర్ అనిశెట్టి శ్రీదేవి అరెస్ట్

హైదరాబాద్‌‌, వెలుగు: మహిళా శిశు సంక్షేమ శాఖ ఆఫీసర్​ అనిశెట్టి శ్రీదేవిని ఏసీబీ అధికారులు గురువారం అరెస్ట్‌‌ చేశారు. హైదరా బాద్‌‌లో అరెస్ట్ చేసి.. కరీంనగర్ ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.‘ఆరోగ్య లక్ష్మి మిల్క్‌‌ సప్లయ్‌‌’ నిధుల గోల్‌‌మాల్‌‌కు సంబం ధించిన డాక్యుమెంట్లను అందించారు. ఏసీబీ అధికారుల వివరాల ప్రకారం.. శ్రీదేవి గతంలో ఆదిలాబాద్‌‌ జిల్లా జైనూర్‌‌‌‌ ఐసీడీఎస్‌‌ ప్రాజెక్ట్‌‌ సీడీపీఓగా పనిచేసింది.

 ‘ఆరోగ్యలక్ష్మి మిల్క్‌‌ సప్లయ్‌‌’ స్కీమ్‌‌లో గ్రామీణ, గిరిజన ప్రాంతాల అంగన్‌‌వాడీలకు అవసరమైన నిధులు జారీ చేసింది.  2015 నుంచి 2016 వరకు రూ.65.78లక్షల నిధులను దారి మళ్లించింది. అంగన్‌‌వాడీలకు చేరాల్సిన నిధులకు సంబంధించి నకిలీ స్టేట్‌‌మెంట్స్‌‌ తయారు చేసింది. ఈ ఆరోపణలతో ఆమెను హైదరాబాద్​కు బదిలీ చేశారు. తర్వాత నిధు ల గోల్​మాల్‌‌పై ఏసీబీకి ఫిర్యాదు చేశారు.