హైదరాబాద్, వెలుగు: ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఖాళీ అవుతున్నది. ఇప్పటికే చాలా మంది కీలక అధికారులు రిటైరైయి వెళ్లిపోగా.. చాలా వరకు పోస్టులు ఖాళీ అవుతున్నాయి. మరోసారి కొత్త సంవత్సరం 2026లోనూ భారీగా అధికారులు రిటైర్కాబోతున్నారు. 68 మంది ఉన్నతాధికారులు పదవీ విరమణ చేయబోతున్నారు.
ఈఎన్సీ జనరల్అంజద్హుస్సేన్సహా11 మంది సీఈలు కూడా రిటైర్కానున్నారు. జనవరి 31న ఈఎన్సీ జనరల్రిటైర్అవబోతున్నారు. అంతేగాకుండా 9 మంది ఎస్ఈలు, 30 మంది ఈఈలు, 17 మంది డీఈఈలు పదవీ విరమణ చేయబోతున్నారు.
