కల్వకుర్తి పట్టణంలోని చోరీ కేసులో నిందితుడి అరెస్ట్

కల్వకుర్తి పట్టణంలోని చోరీ కేసులో నిందితుడి అరెస్ట్
  •     రూ.3 లక్షల నగదు, 25 తులాల బంగారం రికవరీ

కల్వకుర్తి, వెలుగు: ఈ నెల 8న పట్టణంలోని విద్యానగర్  కాలనీలో జరిగిన దొంగతనం కేసులో నిందితుడు పట్టుబడినట్లు సీఐ నాగార్జున తెలిపారు. పట్టణానికి చెందిన శ్రీనివాస శర్మ ఇంటిలో చొరబడి 60 తులాల బంగారం, రూ.7 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేయగా, ఎస్పీ సంగ్రామ్  సింగ్ జీ పాటిల్ నిందితులను పట్టుకునేందుకు డీఎస్పీ వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. 

యూపీకి చెందిన సంయోద్దీన్, షంషోద్దీన్, మహమ్మద్  ఉస్మాన్ చోరీ చేసినట్లు గుర్తించారు. సంయుద్దీన్  యూపీ పోలీసుల ఎదురు కాల్పుల్లో చనిపోగా, షంషోద్దీన్  పరారీలో ఉన్నాడు. మహమ్మద్  ఉస్మాన్ ను అరెస్ట్​ చేసి అతడి నుంచి రూ.3 లక్షల నగదు, 25 తులాల బంగారం రికవరీ చేశారు.