
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. బీసీ రిజర్వేషన్లు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న క్రమంలో.. ఈసారి బీసీ రిజర్వేషన్లు కలుపుకుని మొత్తం 69 శాతానికి రిజర్వేషన్లు పెరగనున్నట్లు చెప్పారు.
తమిళనాడులో మహావిద్య చైతన్య ఉత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు సీఎం రేవంత్.. తెలంగాణలో కూడా తమిళనాడు మాదిరిగా రిజర్వేషన్లు పెంచనున్నట్లు చెప్పారు. తమిళనాడు రిజర్వేషన్ల విధానం అన్ని రాష్ట్రాలకు ఆదర్శం అని అన్నారు.
తెలంగాణలో త్వరలో నిర్వహించనున్న లోకల్ బాడీ ఎన్నికల్లో ఈసారి రిజర్వేషన్లు 69 శాతానికి చేరుకోనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఓబీసీలకు 42%, ఎస్సీ ఎస్టీలకు 27% రిజర్వేషన్లు కలిపి మొత్తంగా 69 శాతం రిజర్వేషన్లు ఇవ్వబోతున్నట్లు చెప్పారు.
తమిళనాడు విద్యా విధానం బాగుందని చెప్పిన సీఎం.. తెలంగాణలో కూడా విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగానే స్పోర్ట్స్ యూనివర్సిటీ, సమీకృత గురుకులాలు ఏర్పాటతు చేస్తున్నట్లు తెలిపారు.