ట్యూషన్కు వెళ్లడం ఇష్టం లేక.. 15వ అంతస్తు నుంచి దూకిన విద్యార్థిని

ట్యూషన్కు వెళ్లడం ఇష్టం లేక.. 15వ అంతస్తు నుంచి దూకిన విద్యార్థిని

హైదరాబాద్ చందానగర్లో విషాదం చోటుచేసుకుంది. ట్యూషన్ కు వెళ్లడం ఇష్టం లేక  ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది.  నల్లగండ్ల అపర్ణ సరోవర్ లో  విద్యార్థిని నివాసం ఉంటుంది.  స్థానికంగా ఉన్న  గ్లెన్డేల్ అకాడమీ స్కూల్ లో  ఆరవ తరగతి చదువుతోంది. అదే కమ్యూనిటీలో 15వ అంతస్తులో కూతురిని మాథ్స్ ట్యూషన్ లో జాయిన్ చేశారు తల్లిదండ్రులు.

ALSO READ: ఉజ్జయినీ హర్రర్.. ఆటోపై రక్తపు మరకలు, నలుగురు అరెస్ట్

అయితే గత కొన్ని రోజులుగా ట్యూషన్ కు వెళ్లనని మారం చేస్తుంది విద్యార్థిని. ఈ రోజు స్కూల్ నుంచి ఇంటికి రాగానే ట్యూషన్ కి వెళ్లాలని తల్లిదండ్రులు ఒత్తిడి చేశారు. దీంతో ఇష్టం లేని విద్యార్థిని 15వ అంతస్తులో ఉన్న ట్యూషన్ గదికి వెళ్లి అక్కడి బాల్కనిలో ఉన్న విండో  నుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకుంది. తీవ్ర గాయలైన విద్యార్థిని అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై విద్యార్థిని తండ్రి సందీప్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు చందానగర్  పోలీసులు.

.