
మహారాష్ట్రలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అకోలాలో ఏప్రిల్ 09 ఆదివారం రోజున ఓ టిన్‌షెడ్‌పై భారీ చెట్టు కూలడంతో ఏడుగురు మృతి చెందగా, 30మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో షెడ్డు కింద 40 మంది ఉన్నట్లుగా జిల్లా కలెక్టర్ నిమా ఆరోరా వెల్లడించారు.
గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లుగా ఆయన తెలిపారు. ఈ ఘటనపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఆర్థిక సాయం అందించాలని సీఎం ఏక్‌నాథ్ షిండే నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.